కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌లోని 267 మంది ఎపి ప్ర‌యాణికులు సుర‌క్షితం

బాలేశ్వ‌ర్‌ (CLiC2NEWS): ఒడిశాలోని బాలేశ్వ‌ర్‌లో ప్రమాదానికి గురైన కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎపి వాసులు 267 మంది ఉన్నారు. వీరంతా సుర‌క్షితమ‌ని అధికారులు వెల్ల‌డించారు. వీరిలో విశాఖ‌కు రిజ‌ర్వేష‌న్ చేయించుకున్న‌వారే 100 మందికిపైగా ఉన్నారు. ఎపి వాసుల‌లో 113 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ వ‌స్తున్నాయి. 20 మందికి స్వ‌ల్ప గాయాలైన‌ట్లు తెలుస్తోంది. అదే విధంగా హ‌వ్‌డా రైలులో ప్ర‌యాణించే ఎపిప్ర‌యాణికులు 49 మంది సుర‌క్షితంగా ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిలో 28 మంది ఫోన్లు స్విఛ్చాఫ్ వ‌స్తున్నాయి. ఇద్ద‌రికి స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి.

ఒడిశాలో జ‌రిగిన రైలు ప్ర‌మాదం.. దేశంలో జ‌రిగిన అతిపెద్ద రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌ల్లో ఒక‌టిగా నిలిచింది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒడిశా నుండి ప్ర‌త్యేక రైళ్ల ద్వారా ప్ర‌యాణికుల‌ను త‌ర‌లిస్తున్నారు. చెన్నైకు ప్ర‌త్యేక రైలు ద్వారా 250 మందిని త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం.

ఒడిశాలో రైలు ప్ర‌మాదం: 280 మంది దుర్మ‌ర‌ణం

ఒడిశా రైలు ప్ర‌మాదం: ర‌క్త‌దానం చేయ‌డానికి స్వ‌చ్చందంగా వచ్చిన యువ‌కులు

Leave A Reply

Your email address will not be published.