రైలు ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించిన ప్ర‌ధాని మోడీ

20 ఏళ్లలో మూడు సార్లు ప్రమాదానికి గురైన కోర‌మాండ‌ల్‌..

క‌ట‌క్‌ (CLiC2NEWS): ఒడిశాలో జ‌రిగిన రైలు ప్ర‌మాద ఘ‌ట‌నా స్థలాన్ని ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప‌రిశీలించారు.  స‌హాయక చ‌ర్య‌ల వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్ప‌త్రుల‌లో చికిత్సపొందుతున్న వారిని ప‌రామ‌ర్సించారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

ప్ర‌మాదానికి సంబంధించి అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని అధికారులు ఆదేశించారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్పందించి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ 20 ఏళ్లలో మూడు సార్లు ప్ర‌మాదానికి గురైంది. మూడు సార్లు చెన్నై వెళ్లే క్ర‌మంలోనే జ‌రిగింది. దీనిలో రెండు సార్లు ఒడిశాలో, ఒక‌సారి ఎపిలో ప్ర‌మాదానికి గురైంది.

 

1 Comment
  1. […] రైలు ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించి… […]

Leave A Reply

Your email address will not be published.