గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. ఏడుగురు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/tractor-accident.jpg)
గుంటూరు (CLiC2NEWS): ఎపిలోని గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వట్టి చెరుకూరులో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. .. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 40 మంది ప్రయాణికులతో ట్రాక్టర్ చెబ్రోలు మండలం జూపూడికి జరిగే శుభకార్యానికి బయలుదేరింది. మార్గమధ్యలో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో ముగ్గురు మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులు గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.