జూన్ 12 నుండి పాఠశాలలు షురూ.. మంత్రి బొత్స
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అదే రోజు ముఖ్యమంత్రి జగన్ పల్నాడు జిల్లాలోని క్రోసూరులో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు. విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ. 1100 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. అంతే కాకుండా పదోతరగతి, ఇంటర్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. జూన్ 28వ తేదీన నాలుగవ విడత అమ్మఒడి నిధులను సిఎం విడుదల చేయనున్నారు.