తెలుగు రాష్ట్రాల‌కు 17 మెడిక‌ల్ క‌ళాశాల‌లు.. కేంద్ర ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశ‌వ్యాప్తంగా 50 కొత్త‌ మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో తెలుగు రాష్ట్రాల‌కు 17 క‌ళాశాల‌లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రానికి 12, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఐదు క‌ళాశాల‌ల‌కు కేంద్ర ఆమోదముద్ర వేసింది. ఎపిలోని ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో కొత్త వైద్య క‌ళాశాల‌లు ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుకానున్నాయి. అదేవిధంగా తెలంగాణ‌లో ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, సిరిసిల్ల, వికారాబాద్‌, జ‌న‌గాం, వ‌రంగ‌ల్‌, భూపాల‌ప‌ల్లి మేడ్చ‌ల్, హైద‌రాబాద్‌ల‌లో నూత‌న క‌ళాశాల‌ల ఏర్పాటు కానున్నాయి. ఈ కాలేజీలు 2023-24 విద్యా సంవ‌త్స‌రంలో 150 సీట్ల‌తో ప్రారంభం కానున్న‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.