మంచిర్యాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్
మంచిర్యాల (CLiC2NEWS): పట్టణ కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు సిఎం శంఖుస్థాపన చేశారు. గోదావరి నదిపై రూ. 164 కోట్లతో నిర్మించినున్న మంచిర్యాల అంతర్గత రహదారి వంతెన, హాజీపూర్ మండలం గుడి పేటలో మెడికల్ కాలేజ్, మందమర్రిలో రూ. 500 కోట్ల వ్యయంతో ఫామ్ ఆయిల్ పరిశ్రమ, రూ . 1,658 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చెన్నూనరు ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి కెసిఆర శంకుస్థాపన చేశారు.