తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి వానలు
ఎపిలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్ (CLiC2NEWS): రాగల మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణకేంద్రం వెల్లడించింది. ఈ రోజు, రేపు ఎల్లుండి తెలంగాణలో పలు చోట్ల ఈదురు గాలులతో పాటు మురుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్ని తెలిపింది.
కాగా నైరుతి రుతుపవనాలు ఆదివారం కర్ణటాక, తమిళనాడు, ఎపి, పుదుచ్చేరి లొని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఎపిలోతిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎపిలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.