వికారాబాద్: నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/sucide.jpg)
పరిగి (CLiC2NEWS): వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఓ నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. పరిగిమండలంలోని కాళ్లాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని (19) తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాలలో గాలించారు. కాగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో విద్యార్థి మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని వికారబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ శిక్షణ తీసుకొంటుంది.