తీరం దాటనున్న బిపోర్‌జాయ్ తుఫాను.. ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్

అహ్మదాబాద్ (CLiC2NEWS): ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను గుజరాత్‌లోని జఖౌ పోర్టు సమీపంలో రేపు సాయంత్రానికి తీరం దాటనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గుజరాత్‌లోని కచ్, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కచ్, ద్వారక, పోర్ బందర్, మోర్బీ, జునాగడ్ రాజ్‌కోట్ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదౌతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బలమైన ఈదురు గాలులతో అనేక చెట్లు నేలకొరిగాయ. ఈ తుపాను భారీ నష్టం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు దాదాపు 38 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బిపోర్‌జాయ్ తుపాను ప్రభావం.. గుజరాత్ రాష్ట్రంతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు , కేరళ, గోవా, రాజస్థాన్ రాష్ట్రాలలొ వర్షాలు కురిసే అవకాశం ఉందీ. వీటితో పాటు డామన్ డయ్యూ, లక్ష్వద్వీప్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి.