ఒడిశాలో రైలు ప్రమాదం.. బాధితులకు రూ. 10 కోట్ల విరాళం ఇస్తానన్న సుకేశ్..
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/odisha-train-accident-5.jpg)
భువనేశ్వర్ (CLiC2NEWS): తిహాడ్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రవేఖర్.. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు రూ. 10 కోట్ల విరాళం అందిస్తానని రైల్వేశాఖకు ఓ లేఖ రాసినట్లు సమాచారం. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుఖేశ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇటీవల ఒడిశాలో ఘోర రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 10 కోట్ల ఆర్ధిక సాయం అందించేందుకు సుకేశ్ ముందుకొచ్చాడు. ఈ సొమ్ము న్యాయబద్దంగా సంపాదించిందేనని.. తాను టాక్స్ కూడా చెల్లిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఈ విరాళాన్ని స్వీకరించాలని రైల్వే మంత్రిని కోరాడు.
ఇటీవల ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 288 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులకు, కుటుంబ పెద్దలను పోగొట్టుకున్నవారిని ఆదుకోవడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుందని సుకేశ్ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు.. మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని రూ. 200 కోట్లు వసూలు చేశాడన్న కేసులో సుకేశ్ ఆరెస్టయ్యాడు.