ఎపి తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వేడిగాలులు
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/sun-heat-scale-750x313.jpg)
హైదరాబాద్(CLiC2NEWS): తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల సగం రోజులు గడిచిపోయిన వర్షాల జాడ లేదు. ఎండల తీవ్రత తగ్గకపోగా.. ఎక్కువవుతుంది. రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో సహా పది రాష్ట్రలలో వేడి గాలులు వీస్తామని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో బిమార్ రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. బిహార్‌లో వేడిగాలులు గత 11 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇపుడు నిరంతరం వేడిగాలలు వీస్తున్నాయి. వరుసగా 20 రోజుల పాటు ఏకధాటిగా వేడిగాలులు వీస్తున్నట్లు తెలుస్తోంది.
ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గోవా, ఛత్తీస్‌గఢ్, ఎపిలలో కూడా సెలవులను పొడిగించినట్లు సమాచారం.