దాహం వేయకున్నా నీళ్ళు తాగాలి: ఐఎండి
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/heatwaves-in-the-state.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): వేడి గాలులు, ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో.. భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ రెండు రోజులూ తీవ్రమైన ఎండలు.. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున హెచ్చరికలు జారీ చేసింది. ఎండలోకి వెళ్లకపోవడమే మంచిదని.. తప్పనిసరై వెళ్లాల్సివస్తే తలకు వస్త్రం చుట్టుకోవాలి. దాహం అనిపించకపోయినా నీళ్లు తాగాలని.. డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని తెలిపింది. వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని, ద్రవ పదార్ధాలైన మజ్జిగ, నిమ్మరసం, లస్సీ వంటివి తాగాలని సూచించింది. ఎండలోకి వెళితే తప్పనిసరిగా గొడుగు వాడాలి. ఈ రెండు రోజులు ఉష్ణోగ్రత అంచనా 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని అంచాన వేసింది. ఆదివారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.