ఇంటికి సమీపంలోనే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు చిన్నారులు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/dead.jpg)
నాగ్‌పూర్ (CLiC2NEWS): తమ పిల్లలు ఆడుకుంటున్నారులే అనుకున్నతల్లిదండ్రులు.. ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆప్రాంతమంతా గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. చివరకు ఇంటికి సమీపంలో ఉన్న ఓ కారులో విగతజీవులై కనిపించారు. ఈ ఘటన నాగ్‌పూర్‌లోని పచ్‌పోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచోసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తౌఫిఖ్ ఫిరోజ్‌ఖాన్, అలియా ఫిరోజ్ ఖాన్, అఫ్రిన్ ఇర్షద్ ఖాన్ ఆడుకోవడానికి వెళ్లి ఎంటకీ ఇంటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి.. చిన్నారుల కోసం గాలించారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా చిన్నారుల జాడలేదు. చివరకు రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న ఒక తుక్కు దుకాణం ముందు ఆగి ఉన్న కారులో ముగ్గురు విగతజీవులై కనిపించారు. చిన్నారులు ఆడుకుంటూ కారులోకి ఎక్కగా.. డోర్‌లాక్ పడిపోయి, ఊపిరాడక మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.