‘జై తెలుగు’.. ఎపిలో కొత్త రాజకీయ పార్టీ..
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/Jonnavittula-Ramalingeswara-rao.jpg)
విజవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ. ‘జై తెలుగు’ పేరుతో కొత్తపార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రకటించారు. తెలుగు భాష, పరిరక్షణ కోసం.. నాయకులు, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పార్టీని పెడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు భాషకు పునర్ వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని .. తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని విజవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.