తండ్రికి ట్రాన్స్‌ఫర్.. తన స్థానంలో కుమార్తెకు బాధ్యతలు అప్పగించిన నాన్న

బెంగళూరు (CLiC2NEWS): ఒక పోలీస్ ఆఫీసర్ బదిలీపై వెళ్లాలి. తన స్థానంలో ఆ స్టేషన్‌కు ప్రభుత్వం ఎస్ ఐగా నియమించిన తన కుమార్తెకు తానే బాధ్యతలు అప్పగించాడు. ఈ అరుదైన ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటుచేసుకుంది. కర్ణాటక లోని మండ్యలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బిఎస్ వెంకటేశ్ బదిలీ అయ్యారు. తన స్థానంలో తన కుమార్తెకు ఎస్ ఐ ఛార్జ్ అప్పగించారు వెంకటేశ్. ఆ సమయంలో తండ్రీ కూతుళ్లు భావోద్వేగానికి గురైయ్యారు. ఈ సన్నివేశాన్ని స్టేషన్‌లోని వారందరూ ఆసక్తిగా తిలకించారు.
వెంకటేశ్ 16 ఏళ్ల పాటు సైన్యంలో సేవలు అందించారు. సైన్యం నుండి రిటూర్ అయ్యాక.. పోలీసు నియామక పరీక్ష రాసి.. మిలటరీ కోటాలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టును సాధించారు. ఆయన కుమార్తె వృత్తి విషయంలో తండ్రి బాటలో నడిచింది. ఎంఎ ఎకనమిక్స్ చదివి.. పోలీసు నియామక పరీక్షల్లో ఎస్ ఐగా ఉద్యోగం సాధించింది. మండ్యలో ఏడాది పాటు ప్రొబెషనరీ ఆఫీసర్‌గా పనిచేసి.. తొలి పోస్టింగ్ మండ్యలో ప్రభుత్వం నియమించింది. తన తండ్రే తనకు బాధ్యతలు అప్పగించిన సందర్భంలో ఇరువురు భావోద్వేగానికి గురయ్యారు.