పేదవారి సొంత ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్ధిక సాయం
గృహలక్ష్మీ పథకం.. మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో గృహలక్ష్మి పథకం కింద సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 3లక్షల ఆర్ధిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వంద శాతం రాయితీలో ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించనుంది. ఈ మేరకు రహదారులు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళల పేరు మేదే గృహలక్ష్మి ఆర్ధిక సాయం అందజేయనున్నారు. దీని కోసం లబ్ధిదారు పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంటుంది. జన్‌ధన్ ఖాతాను వినియోగించకూడదని స్పష్టం చేశారు. రెండు గదులతో కూడిన ఆర్‌సిసి నిర్మాణం కోసం.. ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవెల్, స్లాబు ఇలా మూడు దశలలో సాయం అందిస్తారు. ఆహార భద్రత కార్డు ఉండి, సొంత స్థలం ఉన్న వారు అర్హులు . ఇప్పటికే ఆర్‌సిసి ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వుల కింద లబ్ధి పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేశారు.