అమర వీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సింఎ కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): నగర నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అమర వీరుల స్మారక చిహ్నాన్ని గురువారం సాయంత్రం సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ముందుగా పోలీసులు అమరవీరులకు గన్ సెల్యూట్ చేశారు. అమర వీరులకు నివాళులర్పించిన సిఎం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి.. అమర జ్యోతిని ప్రారంభించారు. అనంతరం అమరవీరులపై ప్రదర్శించిన ప్రదర్శనను సిఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు తిలకించారు.
భారతదేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డన కొలువుదీరిన అమరుల స్మారకం.. జ్వలించే దీపం సాక్షిగా త్యాగధనులను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటామన్నారు.