‘స్పై’ ట్రైలర్ రిలీజ్..
హైదరాబాద్ (CLiC2NEWS): నిఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘స్పై’. ఈ పాన్ ఇండియా చిత్రంతో నూతన దర్శకుడు ఎడిటర్ గ్యారీ బి. హెచ్ పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో కథానాయకగా ఐశ్వర్య మేనన్ నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ మరణం వెనుక దాగి ఉన్న రహస్యాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తి రేకిత్తిస్తుంది.