రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స‌ర్కార్ శుభ‌వార్త..

ప‌లు ర‌కాల అల‌వెన్సులు పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ తెలిపింది. రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ధి ఉత్త‌స‌వాల సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చే అల‌వెన్సుల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం..

ట్రావెలింగ్ అండ్ క‌న్వీనియ‌న్స్ అల‌వెన్స్ – 30%

బ‌దిలీపై వెళ్లే ఉద్యోగుల‌కు ట్రాన్స్‌పోర్ట్ అల‌వెన్స్ -30%

సెల‌వు రోజుల్లో ప‌నిచేసే లిఫ్ట్ ఆప‌రేట‌ర్ల‌, డ్రైవ‌ర్ల‌కు అద‌నంగా రూ. 150 చెల్లింపు

షెడ్యూల్ ఏరియాలో ప‌నిచేసే ఉద్యోగుల‌కు స్పెష‌ల్ కాంప‌న్సేట‌రీ అల‌వెన్స్ – 30 %
దివ్ఆయంగ ఉద్యోగుల‌కు ఇచ్చే క‌న్వీనియ‌న్స్ అల‌వెన్స్ రూ. 2000 నుండి రూ. 3000కు పెంపు

ఇళ్లు నిర్మించుకునే ఉద్యోగుల‌కు ఇచ్చే అడ్వాన్స్ ప‌రిమితిని రూ. 20 ల‌క్ష‌ల నుండి రూ. 30 ల‌క్ష‌ల‌కు పెంపు

కారు కొనాగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ ప‌రిమితిని రూ. 6 ల‌క్ష‌ల నుండి రూ. 9 ల‌క్ష‌ల‌కు పెంపు.

మోటార్ వెహిక‌ల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 80 వేల నుండి రూప 1 ల‌క్ష‌కు పెంపు

ఉద్యోగుల పిల్ల‌ల వివాహాల‌కు సంబంధించి.. కుమార్తె వివాహానికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 1 ల‌క్ష నుండి రూ. 4 ల‌క్ష‌ల‌కు.. కుమారుడికి రూ. 75 వేల నుండి రూ. 3 ల‌క్ష‌ల‌కు పెంపు.

స్టేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉద్యోగుల‌కు ఇచ్చే ఇన్సెంటివ్ – 30%

గ్రేహౌండ్స్‌, ఇంటిలిజెన్స్‌, ట్రాఫిక్‌, సిఐడి, ఆక్టోప‌స్‌, యాంటీ న‌క్స‌లైట్ స్క్వాడ్ విభాగాల్లో ప‌నిచేసే పోలీసుల‌కు ఇచ్చే స్పెష‌ల్ పేను 2020 పే స్కేల్ ప్ర‌కారం వ‌ర్తింప‌జేయాల‌ని నిర్ణ‌యించారు.

పెన్ష‌న‌ర్లు మ‌ర‌ణిస్తే.. అందించే త‌క్ష‌ణ సాయం రూ. 20 వేల నుండి రూ.30 వేల‌కు పెంపు.

ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వ‌ర్తించే అన్ని విభాగాల్లోని ఉద్యోగుల‌కు అద‌నంగా 15% స్పెష‌ల్ పే.

 

Leave A Reply

Your email address will not be published.