ఆనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన కుటుంబం ఆత్మహత్య..

ఖమ్మం (CLiC2NEWS): జిల్లలోని పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఆనారోగ్య సమస్యలు కారణంగా దంపతులు కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. కృష్ణయ్య, సుహాసిని దంపతులకు కుమార్తె ఉంది. ఇటీవల సుహాసిని తిరువూరులో గర్భసంచి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. నమూనాలను టెస్టింగ్‌కు పంపగా గురువారం కాన్సర్‌గా నిర్ధారణయినట్లు సమాచారం. వైద్యులు కీమో థెరపీ చేయించుకోవాలని.. దాని కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొత్తరాయగూడెంలోని వారి మామిడితోటలో చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
This paragraph will assist the internet people for creating new blog or even a weblog from start to end.