అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులను ప్రశంసింన ప్రధాని మోడీ

వాషింగ్టన్ (CLiC2NEWS): ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నవిషయం తెలిసినదే. గురువారం ఆయనకు శ్వేతసౌతంలో సాదర స్వాగతం లఢించింది. అధికారక లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్, జిల్ బైడెన్ దంపతులకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ఈ స్వాగతం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని హర్షం వ్యక్తం చేశారు.
అమెరికాలో కీలక పదవుల్లో కొనసాగుతున్న ప్రవాస భారతీయులపై ప్రశంసలు కురిపించారు. భారత మూలాలు కలిగిన ఎందరో వ్యక్తులు ప్రస్తుతం అగ్రదేవంలో తమ మార్క్ చూసిస్తున్నారన్నారు. వారిలో కొందరు చట్టసభల్లో కూర్చున్నారని.. ఈ కాంగ్రెస్‌లో ‘సమోసా కాకస్’ ఫ్లేవర్ మరింత విస్తరించాలని ఆశిస్తున్నానన్నారు.
సమోసా కాకస్.. అమెరికా చట్ట సభలకు ఎన్నికైన దక్షిణాసియా మూలాలున్న వ్యక్తులు. ప్రధానంగా భారతీయులను ఉద్దేశించి ఈ పదాన్ని వాడతారు. భారత్‌లోని భిన్న రుచులన్నీ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను అని అమెరికాలో భారతీయుల ప్రధాన్యం మరింత పెరగాలన్న ఉద్దశంతో ప్రధాని ఈ విధంగా చమత్కారంగా మాట్లాడారు.