తనిఖీల భయంతో పక్కింటిపై విసిరిన రూ. 2 కోట్లు..
విజులెన్స్ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఓ అధికారి నిర్వాకం

భువనేశ్వర్ (CLiC2NEWS): అక్రమాస్తుల కేసులో అధికారులు సోదాల భయంతో ఒడిశాకు చెందిన ఓ అధికారి నోట్ల కట్టలున్న బాక్సులను పక్కింటిపైకి విసిరేశాడు. ఈ సంఘటన భువనేశ్వర్‌లో జరిగింది. నబరంగ్‌పుర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నయానే ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు శుక్రవారం సోదాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన ఆరు బాక్సుల్లో నగదు పేర్చి.. పక్కింటి టెర్రస్‌పై విసిరేశారు. ఇది గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఆ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రూ. 2 కోట్ల విలువైన రూ. 500 నోట్ల కట్టలు ఉన్నాయి. ఇటీవలే ఆ అధికారి రూ. 2000 నోట్లను రూ. 500 నోట్లుగా మార్పిడి చేయించినట్లు సమాచారం.
అధికారలు ఏకకాలంలో తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహించి సుమారు రూ. 3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.