Telangana: స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో 1827 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ ప‌రిధిలోని టీచింగ్ ఆస్ప‌త్రుల‌లో మొత్తం 1827 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తిస్తూ.. శుక్ర‌వారం ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టాఫ్ న‌ర్సు పోస్టుల‌ను తెలంగాణ మెడిక‌ల్ హెల్త్ అండ్ రిక్రూట్ మెంట్ బోర్డ్ డైరెక్ట రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజ్ ఏర్పాటు చేయాల‌నే సిఎం ల‌క్ష్యాన్ని అతి త్వ‌ర‌లో చేరుకుంటామన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు కేవ‌లం 5 మెడిక‌ల్ కళాశాల‌లు మాత్ర‌మే ఉండేవ‌ని.. ప్ర‌స్తుతం ఆసంఖ్య 26కు చేరింద‌ని తెలిపారు. వ‌చ్చే ఏడాదిలో మ‌రో 8 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటుకు చేసేందుకు అవ‌స‌ర‌మైన చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.