26 ఏళ్ల తర్వాత ఈజిప్టుకు భారత ప్రధాని
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/MODI-VISIT-TO-EGYPT.jpg)
కైరో (CLiC2NEWS): ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజులు ఈజిప్టు పర్యటనలో భాగంగా ఈజిప్టుకు వెళ్లారు. 1997 తర్వాత మన దేశ ప్రధాన ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. ఈజిప్టు ప్రధాని ముస్తఫా మద్బౌలీ మోడీకి ఘన స్వాగతం పలికారు. ఆదేశ సేనల గౌరవ వందనం స్వీకరించారు.
ప్రధాని మోడీకి ఇది మొదటి పర్యటన. ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు మోడీ ఈ జిప్టులో పర్యటించనున్నారు. ముందుగా మొదటి ప్రపంచ యుధ్ద సమయంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పిస్తారు. వారి కోసం హెలియో పొలిస్ కామన్ వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీలో స్మారకం నిర్మించారు. అనంతరం ఈజిప్టు ప్రధానితో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి హాజయ్యారు.