తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్‌హౌస్‌లో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబీకులు నాగర్‌కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిచంద్ మృతిచెందారు. సాయిచంద్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్రంగూడలోని ఇంటికి తరలించారు. కాగా విషయం తెలిసన వెంటనే రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆసుపత్రి కి చేరుకున్నారు.