ఆ న‌దిలోని నీరంతా ఒక్క‌సారిగా రంగు మారిపోయింది..!

భ‌యభ్రాంతుల‌కు గురైన ప్ర‌జ‌లు..

టోక్యో (CLiC2NEWS): ఓ న‌దిలోని నీరు క్ర‌మంగా రంగుమారి పోయింది. ఒక్క‌సారిగా ముదురు ఎదుపు రంగులోకి మార‌డంతో అక్క‌డ ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు లోన‌య్యారు. ఈ ఘ‌ట‌న ఒకినావా ద్వీపంలోని నాగో న‌గ‌రంలో జ‌రిగింది. అయితే ఇలా నీరు రంగు మార‌డానికి గ‌ల కార‌ణాలు తెలీక ప్ర‌జ‌లు కంగారుప‌డ్డారు. బీర్ ఫ్యాక్ట‌రీలో ఏర్ప‌డిన లీకేజీనే కార‌ణ‌మ‌ని స‌మాచారం. ఫ్యాక్ట‌రీకి చెందిన కూలింగ్ వ్వ‌వ‌స్థ‌ల్లో ఒక‌దానిలో ఏర్ప‌డిన లీక్ వ‌ల్ల ఆహార‌ప‌దార్థాల్లో క‌లిపే రంగు పొర‌పాటున న‌దిలోకి విడుద‌లైంద‌ని.. దానివ‌ల్ల నీరంతా ముదురు ఎరుపు రంగులోకి మారిపోయింది. అయితే దీని వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అలాగే క్ష‌మాప‌ణ‌లు కూడా తెలిపిన‌ట్లు స‌మాచారం. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ర‌లా పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది.

 

Leave A Reply

Your email address will not be published.