4 లక్షల ఎకరాలకుపైగా పోడు పట్టాలు.. మహిళల పేరు మీదనే పంపిణీ
ఆదివాసీలకు పోడు భూములతో పాటు రైతుబంధు పంపణీ..

ఆసిఫాబాద్ (CLiC2NEWS): కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ఆదివాసీలకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన పోడు భూముల పంపిణీ పట్టాలన్నీ మహిళ పేరు మీదే అందిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. పోడు పట్టాలతో పాటు వారికి రైతు బంధు చెక్కులను సైతం సిఎం అందించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయం, ఎస్‌పి కార్యాలయం, సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం కుమురం భీం విగ్రహావిష్కరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,51,000 మంది రైతులకు 4.06 లక్షల ఎకరాలను పోడు భూముల పట్టాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గతంలో అడవులను ఆక్రమించారని కొంత మంది గిరిజనుల మీద కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సిఎస్, డిజిపిలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు కూడా 3ఫేజ్ కరెంట్ అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గిరివికాసం కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని సిఎం తెలిపారు.