అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

అనకాప‌ల్లి (CLiC2NEWS): జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మా కంపెనీలో శుక్ర‌వారం భారీ అగ్రి ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందగా.. మ‌రో ఐదుగురు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. రియాక్ట‌ర్ పేల‌డంతో మంట‌లు పెద్ద ఎత్తున ఎగ‌సి ప‌డుతున్నాయి. ప్ర‌మాదం జ‌రిగి ఐదు గంట‌లైనా మంటలు అదుపులోకి రాలేదు. 11 అగ్నిమాప‌క శక‌టాల‌తో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.ముగ్గురు అగ్నిమాప‌క సిబ్బందికి సైతం గాయాల‌య్యాయి.

అచ్యుతాపురం సాహితీ ఫార్మాలో రియాక్ట‌ర్ పేల‌డంతో ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించాయి. ప్ర‌మాద స‌మ‌యంలో కంపెనీలో 35 కార్మికులు విధుల‌లో ఉన్నారు. భారీ శ‌బ్ధం రావ‌డంతో కార్మికులు బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ప్ర‌మాదంలో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను విశాఖ కెజిహెచ్‌కు త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. వీరిలో ఇద్ద‌రు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Leave A Reply

Your email address will not be published.