గ్రూప్-4 అభ్య‌ర్థులు చెప్పులే వేసుకోవాలి: టిఎస్‌పిఎస్‌సి

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ్రూప్‌-4 ప‌రీక్ష రాసే అభ్యుర్థులు చెప్పులే వేసుకుని ప‌రీక్ష‌కు హాజ‌రుకావాల‌ని టిఎస్‌పిఎస్‌సి సూచ‌న చేసింది. రాష్ట్రంలో రేపు గ్రూప్‌-4 ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో టిఎస్‌పిఎస్‌సి ప‌లు కీల‌క సూచ‌నలు చేసింది. శ‌నివారం ప‌రీక్ష కేంద్రాలు ఉద‌యం 8 గంట‌ల నుండి అనుమ‌తించ‌నున్నారు. ప‌రీక్ష‌కు 15 నిమిషాల ముందే 9.45 గంట‌ల‌కు గేట్లు మూసివేస్తార‌ని క‌మిష‌న్ తెలిపింది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు పేప‌ర్‌-2కి తిరిగి అనుమ‌తిస్తారని.. 2.15 గంట‌ల‌కు గేట్లు మ‌ర‌ల మూసివేయ‌నున్న‌ట్లు పేర్కొంది. వ‌చ్‌, హ్యాండ్ బ్యాగ్‌, ప‌ర్సుల‌ను ప‌రీక్ష హాలుతోక‌లి అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. ప‌రీక్ష రాసే అభ్య‌ర్థులు చెప్పులే వేసుకోవాల‌ని.. ఎవ‌రూ బూట్లు ధ‌రించొద్ద‌ని సూచించింది. ఎవ‌రైనా అక్ర‌మాల‌కు పాల్ప‌డితే.. క్రిమిన‌ల్ కేసులు త‌ప్ప‌వ‌ని.. శాశ్వ‌తంగా డీబార్ చేస్తామ‌ని హెచ్చ‌రించింది.

Leave A Reply

Your email address will not be published.