మెదక్ జిల్లాలో లారీ ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

మెదక్ (CLiC2NEWS): జిల్లాలో రెండు కంటైనర్ లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న కంటైనర్ లారీని మరో కంటైనర్ వచ్చి ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటన మెదక్ జిల్లా కాస్లాపూర్ వద్ద సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సంగి మండలం కాస్లాపూర్ వద్ద రోడ్డు ప్రక్కన ఆగిఉన్న కంటైనర్ లారీని మరో కంటైనర్ ఢీకొట్టింది. బెంగళూరు నుండి నాగ్‌పుర్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ టైర్ పేలి ప్రమాదం జరిగింది. దీంతో ఈ లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.