రాష్ట్ర వ్యాప్తంగా 134 ఉచిత వైద్య పరీక్షలు: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా 134 ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శనివారం ఈ ఉచిత వైద్య పరీక్షలను వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నొస్టిక్స్ సెంటర్లు, 16 రేడియాలజి సెంటర్లను అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54 వైద్య పరీక్షలు మాత్రమే ఉచితంగా చేస్తున్నారని.. ఇపుడు 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో వైద్యులు చాలా కష్టపడ్డారని.. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చారని కొనియాడారు.