తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉద్యోగాల భర్తీ..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలిసినా.. సమాచారం ఇవ్వాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 97 వేల మందికి పైగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని.. ఉద్యోగాల భర్తీ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఎలాంటి అవకతవకలకు తావులేదని.. అక్రమాలు జరిగినట్లు తెలిస్తే పోలీసు నియామక మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు. పక్కా సమాచారం అందిస్తే వారికి రూ. 3 లక్షల పారితోషికం ఇస్తామని ప్రకటించారు.