సినీ గాయని సునీత తనయుడు హీరోగా ఎంట్రీ..

హైదరాబాద్ (CLiC2NEWS): సింగర్ సునీత పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. సునీత టాలీవుడ్ లో పలువురు హీరోయిన్తకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఇప్పటికే ఈమె కుమార్తె గాయనిగా పరిచయమైంది. ఇపుడు కొడుకు కూడా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న సర్కారు నౌకరి పేరుతో తీస్తున్న సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. భావన కథానాయికగా నటిస్తోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. దీంతో కొడుకుకు కంగ్రాట్స్ చెబుతూ.. ఓ తల్లీ, కుమారిడి కల నెరవేరిన రోజు ఇది అంటూ సనీత ట్వీట్ చేశారు.