తెలుగు రాష్ట్రాల బిజెపి నూతన అధ్యక్షులు..

ఢిల్లీ (CLiC2NEWS): భారతీయ జనతా పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లో నూతన అధ్యక్షులను నియమించింది. ఆంధ్రప్రదేశ్లో సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరి, తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలను నియమించింది. ఈ మేరకు జాతీయ అధ్యాక్షడు జెపి నడ్డా నిర్ణయించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటనలో తెలిపినట్లు సమాచారం. కిషన్ రెడ్డి రెండో సారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి పార్టీ వ్యూహాత్మక మార్పులు చేర్పులు చేస్తుంది. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నూతన అధ్యక్షులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా తెలంగాణలో బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటి ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అలాగే ఎపి మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించింది.
రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను అర్హుడిని కాదా..?: ఎమ్మెల్యే రఘునందన్‌రావు