గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ ఛైర్పర్సన్గా వేద రజని నియామకం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పెరేషన్ ఛైర్పర్సన్ సాయిచంద్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. సాయిచంద్ స్థానంలో ఆయన భార్య వేద రజని నియామించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించినట్లు సమాచారం. సాయిచంద్ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్ధిక సాయాన్ని మంత్రి కెటిఆర్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని బిఆర్ ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుండి సమకూరుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.