శ్రీకాళహస్తి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

శ్రీ కాళహస్తి (CLiC2NEWS): తిరుమల శ్రీవారిని దర్శించుకొని.. కాళహస్తి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని శ్రీ కాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విజయవాడకు చెందిన ఏడుగురు ఎర్టిగా వాహనంలో తిరుపతికి వెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణంలో కాళహస్తి వెళ్తున్నారు. మిట్ట కండ్రిగ వద్ద వీరి వాహనం ఎదురుగ వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకుపోయింది. ప్రమాదం సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.