రోడ్డు ప్రమాదానికి గురైన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి

ప్రకాశం (CLiC2NEWS): జిల్లాలోని సాగర్ కాల్వలోకి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడినట్లు సమాచారం. ఆర్టిసి బస్సును అద్దెకు తీసుకుని.. సోమవారం అర్థరాత్రి దాటన తర్వాత పెళ్లి బృందం పొదిలి నుండి కాకినాడకు వెళ్తుంది. మార్గ మధ్యలో దర్శి సమీపంలోని సాగర్ కెనాల్లోకి బస్సు దూసుకుపోయి ప్రమాదం చోటుచోసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 35 నుండి 40 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వలన ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన వారంతా పొదిలి గ్రామనికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఒంగోలు ఆస్పత్రికి తలలించి వైద్యం అందిస్తున్నారు.
బస్సు ప్రమాద ఘటనపై సిఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.