NIA Court: ప్రొఫెస‌ర్ చేతిని న‌రికిన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు:

కోచి (CLiC2NEWS):  కేర‌ళ‌లోని ఓ కాలేజి ప్రొఫెస‌ర్ చేతిని న‌రికిన కేసులో ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ముగ్గురు దోషుల‌కు జీవిత ఖైదు విధించింది. కేర‌ళ‌లోని ఇడుక్కి జిల్లా తొడుపుళలోని న్యూమ్యాన్‌ కాలేజీలో ప్రొఫెస‌ర్‌పై 2010లో దాడి చేసి అత‌ని చేతిని న‌రికేశారు. ఈ కేసులో నిషేధిత ఇస్లామిక్ ఉగ్ర సంస్థ పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కు చెందిన ఆరుగ‌రురిని దోషులుగా తేల్చారు. ముగ్గురు దోషుల‌కు (ఎన్ఐఎ కోర్టు) ప్ర‌త్యేక న్యాయ‌స్థానం గురువారం జీవిత ఖైదు ఖ‌రారు చేసింది. వీరికి ఆశ్ర‌యం క‌ల్పించ‌డం, పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో మ‌రో ముగ్గురికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది.

బికాం సెమెస్ట‌ర్ ప‌రీక్ష‌ల ప్ర‌శ్నాప‌త్రంలో ఓ మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ప్రొఫెస‌ర్ ప్ర‌శ్న‌లు రూపొందించార‌ని.. 2010 జులై 4వ తేదీన పిఎఫ్ ఐ స‌భ్యులు ప్రొఫెస‌ర్‌పై దాడి చేసి ఆయ‌న కుడి చేతిని న‌రికేశారు. ఈ కేసులో 11 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌ధాన నిందితుడు స‌వాద్ నాటి నుండి ప‌రారీలోనే ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ కేసులో సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టిన ఎన్ ఐ ఎ కోర్టు.. ఆరుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పును వెలువ‌రించింది. ముగ్గురికి జీవిత ఖైదు విధించింది.

Leave A Reply

Your email address will not be published.