దోమలగూడ గ్యాస్‌లీక్ ఘటన.. నాలుగుకి చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని దోమలగూడలో మంగళవారం గ్యాస్ లీకయ్యి ఆ ఇంట్లో ఉన్నవారందరూ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసందే. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు గాయపడ్డారు. వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స నందిస్తున్నారు. బుధవారం ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. తాజాగా మరో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంట్లో పిండి వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ప్రమాదం జరిగింది.