ISRO: చంద్రయాన్ -3.. జాబిల్లి దిశగా ప్రయాణం

సూళ్లూరుపేట (CLiC2NEWS): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుడిపై అన్వేషణ కోసం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి చేరింది. శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుండి చంద్రయాన్-3ని నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్లిన రాకెట్ ఎల్విఎం-3. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌ను మోసుకుని అత్యంత శక్తివంతమైన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మూడు దశలను పూర్తి చేసుకొని చంద్రయాన్ -3 చంద్రుడివైపు పయనిస్తుంది.
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. అన్ని ప్రక్రియలు సజావుగా సాగితే ఆగస్టు 23 సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టే అవకాశం ఉందని తెలిపారు.