శ్రీవారికి 2 కేజీల బంగారు శంఖం సమర్పించిన పాలక మండలి సభ్యురాలు

తిరుమల (CLiC2NEWS): తిరుమల శ్రీవారికి భక్తులు 2 కేజీల బంగారు శంఖం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు స్వామివారికి ఈ భరీ విరాళం సమర్పించారు. ఈ బంగారు శంఖంను శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించనున్నట్లు సమాచారం. ఆదివారం ఇఒ ధర్మారెడ్డికి ఈ బంగారు శంఖం అందజేశారు. దాదాపు రెండు కేజీలతో తయారు చేసిన శంఖం విలువ సమారు కోటి రూపాయలు ఉంటుందని సమాచారం.