డివైడర్‌పై దూసుకొచ్చి కారు, బొలెరొను ఢీకొన్న లారీ .. ముగ్గరు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/Road-accident-in-medchal.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఔటర్ రింగ్ రోడ్డుపై శామీర్‌పేట – కీసర మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ నుండి మేడ్చల్ వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌పై నుండి దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో లారీ డ్రైవర్, బొలెరో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.M