తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/rains.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుండి మూడు రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని, హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. భూపాలపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి అధికారులు ఎప్పటికప్పుడు మోటర్ల సాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 503.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.