ట్రాన్స్ఫార్మర్ పేలడంతో 15మంది దుర్మరణం
డెహ్రాడూన్ (CLiC2NEWS): ట్రాన్స్ఫార్మర్ పేలి.. విద్యుదాఘాతానికి గురై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో చోటుచేసుకుంది. అలకనందా నదిపై ఉన్న ఓ వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. నమామీ గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనందా నదిపై ఉన్న వంతెనకు పవర్ రావడం వలన ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ పేలడం వలన వంతెన రెయిలింగ్‌కు కరెంట్ సప్లై అయుంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.