Mangalagiri: నేడు జగనన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణానికి సిఎం శంకుస్థాపన
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/cm-jagan.jpg)
విజయవాడ (CLiC2NEWS): ‘నవరత్నాలు-పేదలందరికే ఇళ్లు’ పథకం కింద నిర్మించబోతున్న గృహాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెదకాకాని మండలంలో సోమవారం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనకు సిఎం రానున్నారు. మొత్తం 53 వేల మంది పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం లేఅవుట్ వద్ద నిర్వహించనున్న ఈ కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, విడుదల రజిని, జోగి రమేష్, బాపట్ల ఎంపి నందిగం సురేష్, సిఆర్డిఎ కమిషనర్ వివేక్ యాదవ్, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు.