AP: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుపై సస్పెన్షన్ వేటు..!
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/KR-SURYANARAYAN.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ జారీ చేసింది. సూర్యనారాయణ రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యేంత వరకు ఆయనపై సస్పెన్సన్ ఉత్తర్వులు కొనసాగుతాయని.. ఆ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా విజయవాడను వీడి వెళ్లొద్దంటూ రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. సూర్యనారాయణతో పాటు సహ ఉద్యోగులు వ్యాపారుల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వం అభియోగాల్లో తెలిపింది. అయితే వీటిపై విజయవాడ సిటి పోలీసులు కూడా కేసు నమోదు చేశారని.. ఇప్పటికీ విచారణకు సహకరించకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు సమాచారం.