ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఆకలితో తెలంగాణ యువతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/CLiC2NEWS.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణకు చెందిన మహిళ అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు వెళ్లింది. ఏం జరిగిందో ఏమోకానీ ఆమె ప్రస్తుతం చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. హైదరాబాద్‌కు చెందిన యువతి 2021లో ఆగస్టులో అమెరికాకు మాస్టర్స్ చేసేందుకు వెళ్లింది. అప్పటి నుండి అమె తరచూ తల్లి ఫోన్ చేస్తూ ఉండేది. గత రెండు నెలల నుండి తన దగ్గర నుండి ఎటువంటి ఫోన్‌కాల్‌గాని.. సమాచారం గాని లేదు. నగరం నుండి ఇటీవల అమెరికాకు వెళ్లిన కొందరు ఆమెను గుర్తించి తల్లికి తెలియజేశారు. ఆ మహిళ వస్తువులను ఎవరో దొంగిలించారని, దీంతో ఆమె చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని సమాచారం అందించారు. ఇది విన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. వెంటనే తన కుమార్తెను భారత్ తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు.