మోరంచపల్లి ప్రజలను కాపాడేందుకు హెలికాప్టర్: సిఎం కెసిఆర్
భూపాలపల్లి (CLiC2NEWS): రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామానికి వరద నీరు పోటెత్తింది. దీంతో గ్రామంలోని ఇండ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రజలు కొంతమంది వరదలో చిక్కుకుపోయారు. జిల్లాలోని మొరంచవాగు భారీగా ప్రవహిస్తోంది. భూపాలపల్లి – పరకాల రహదారిపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇండ్లలో 4 నుండి 5 సెంటీమీటర్ల మేర నీరు నిలిచపోయింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇంటి స్లాబ్‌లు, చెట్లు ఎక్కి ప్రాణాలు నిలుపుకుంటున్నారు.
మోరంచపల్లి గ్రామంలోని ఇండ్లన్నీ నీట మునిగి పోవడంతో అక్కడి ప్రజలను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గ్రామంలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.