AP: వరద కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 10వేలు..
తక్షణ సాయం కింద రూ. 2వేలు
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/cm-jagan.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో వరద కారణంగా నిరాశ్రయులైన వారికి తక్షణ సాయం కింద రూ.2వేలు.. దెబ్బతిన్న ఇళ్లకు రూ. 10వేలు చొప్పున ఆర్ధికసాయం అందజేయాలని సిఎం నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎపిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ప్రవహిస్తుటుండంతో ప్రజలను రక్షణ శిబిరాలకు తరలించారు. శుక్రవారం ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సహాయ పునరావాస కేంద్రాల్లో తలదాచుకొంటున్న వారికి అన్ని సదుపాలయాలు కల్పించాలన్నారు. అయితే వారిని శిబిరాల నుండి పంపేటపుడు కుటుంబానికి రూ. 2వేలు, వ్యక్తులైతే రూ. వెయ్యి చొప్పున సాయం చేయాలన్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల్లో దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు.