శోభ‌న ఇంట్లో చోరీ!

చెన్నై (CLiC2NEWS): ప్ర‌ముఖ టాలీవుడ్‌, కోలీవుడ్ న‌టి శోభన ఇంట్లో చోరీ జ‌రిగింది. శోభ‌న గ‌త కొంత కాలంగా చెన్నైలోని శ్రీ‌నివాస రోడ్డులో నివాసం ఉంటోంది. శోభ‌న‌తో పాటు త‌న త‌ల్లి కూడా ఉంటోంది. వారికి ఇంట్లో ప‌నుల‌ను చేయ‌డానికి కాట్టుమ‌న్నార్ కోవిల్‌కు చెందిన విజ‌య అనే మ‌హిళను ప‌నిమ‌నిషిగా పెట్టుకున్నారు.

విజ‌య గ‌త యేడాది కాలంగా శోభ‌న ఇంట్లో ప‌ని చేస్తుంది. కాగా ఈ క్రమంలో శోభ‌న ఇంట్లో అప్పుడప్పుడు కొద్ది పాటి డబ్బులు చోరీ జ‌రుగుతూ ఉండేవి. ఈ కార‌ణంగా శోభ‌న‌కు ప‌ని మ‌నిషి విజ‌య‌పై అనుమానం రావ‌డంతో స్థానిక పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. అనంత‌రం పోలీసులు ప‌నిమ‌నిషి విజ‌య‌ను అదుపులోకి తీసుకొని ద‌ర్యాప్తు చేశారు. పోలీసులు వారి ప‌ద్ధ‌తిలో విచార‌ణ జ‌రుప‌గా దాదాపు రూ. 41 వేలు చోరీ చేసిన‌ట్లు తెలిపింది.

కాగా పేద‌రికం కార‌ణంగా చోరీ చేసిన‌ట్లు ప‌ని మ‌నిషి విజ‌య ఒప్పుకొని క్ష‌మించాల‌ని శోభ‌న‌ను ప్రాధేయ ప‌డ‌టంతో.. పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదును న‌టి ఉప సంహ‌రించుకొంది. అలాగే ప‌ని మ‌నిషి మ‌న్నించి ఇంట్లో ప‌నిచేయ‌డానికి అనుమ‌తి కూడా ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.